బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న లక్కీ హీరోయిన్
భీమ్లా నాయక్, బింబిసార, సర్, విరూపాక్ష, డెవిల్ సినిమాల్లో నటించి మంచి హిట్స్ అందుకుంది సంయుక్త మీనన్. తెలుగులో అమ్మడు నటించిన అన్ని సినిమాలూ హిట్ అవడంతో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సంయుక్త తెలుగులో కంటే తమిళ, మలయాళ భాషల్లో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల సౌత్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది.
ఇప్పుడు ఈ లక్కీ హీరోయిన్ గా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే సంయుక్త ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ బాలీవుడ్ సినిమా ద్వారా సంయుక్త బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో కాజోల్ లీడ్ రోల్ లో నటించనుండగా, ప్రభుదేవా, నసీరుద్దీన్ షా కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.
భారీ అంచనాలున్న ఈ సినిమాలో సంయుక్త ఛాన్స్ కొట్టేయడమే తన లక్ ను మరోసారి నిరూపిస్తుంది. సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ లో సక్సెస్ అవడం చాలా అరుదు. బాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించడం అనుకున్నంత ఈజీ కాదు. సంయుక్త కాస్త కష్టపడితే అక్కడ కూడా మంచి మంచి ఛాన్సులు అందుకుని స్టార్ స్టేటస్ ను అనుభవించే ఛాన్సుంది.













