Samantha: రంగస్థలం కాంబో రిపీట్?
ఏ మాయ చేసావె(Ye maya chesave) తో కెరీర్ ను మొదలుపెట్టిన సమంత(Samantha) ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత సమంత వెనక్కి తిరిగి చూసుకునే పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. టాలీవుడ్ లో అందరి సరసన వెంటనే ఛాన్స్ అందుకున్న సమంత, రామ్ చరణ్(Ram charan) తో సినిమా చేయడానికి మాత్రం కాస్త టైమ్ పట్టింది.
మొత్తానికి రంగస్థలం(Rangasthalam) తో ఆ ఛాన్స్ ను కూడా అందుకుని తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది సమంత. ఆ మూవీలో సమంత, చరణ్ కెమిస్ట్రీ చూసి అందరూ మెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరో మూవీ చేసింది లేదు. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో మూవీ వస్తుందని ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో చరణ్ తో కలిసి మరో మూవీ చేయాలనుకుంటున్నట్టు సమంత తెలిపింది. సిడ్నీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంతను రామ్ చరణ్ తో కలిసి మరో మూవీ చేయాలని ఆయన అభిమానులు కోరగా, దానికి సమంత నవ్వుతూ నేను కూడా అది జరగాలని కోరుకుంటున్నా అని చెప్పింది. ప్రస్తుతం ఆర్సీ16(RC16) చేస్తున్న చరణ్, తర్వాత సుకుమార్(Sukumar) తో చేయబోయే సినిమాలో సమంతనే హీరోయిన్ అని వార్తలొస్తున్న విషయం తెలిసిందే.













