Citadel2: సమంత సిటాడెల్2 రద్దు
ఖుషి(Kushi) సినిమా తర్వాత సమంత(Samantha) నుంచి సినిమాలు రాలేదు. మొన్నీ మధ్య సిటాడెల్ హనీ బన్నీ(Citadel Honey bunny) అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత ఆ సిరీస్ తో మంచి రెస్పాన్స్ అందుకుంది. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కు ఇండియన్ వెర్షన్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో వరుణ్ ధావన్(Varun Dhawan), సమంత నటించారు. ఆ సిరీస్ కు సీక్వెల్ గా సీజన్2 ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ప్రైమ్ వీడియో సిటాడెల్2(Citadel2) ఇండియన్, ఇటాలియన్ వెర్షన్స్ ను క్యాన్సిల్ చేస్తున్నట్టు వెల్లడించింది. వాటిని రద్దు చేస్తూ సిటాడెల్2 ఒరిజినల్ వెర్షన్ లో వాటిని విలీనం చేస్తున్నామని, సిటాడెల్ ఒరిజినల్ వెర్షన్ ను మరింత గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నామని ప్రైమ్ వీడియో తెలిపింది. అయితే సిటాడెల్2 వెర్షన్స్ రద్దవడానికి కారణం బడ్జెటే అని తెలుస్తోంది.
సిటాడెల్ ఇండియన్, ఇటాలియన్ వెర్షన్స్ సక్సెస్ అయినప్పటికీ ఒకే సిరీస్ ను ఇన్ని వెర్షన్స్ లో తీయాలంటే బడ్జెట్ భారీగా అవుతుండటం వల్లే వీటిని రద్దు చేసి ఒరిజినల్ లో విలీనం చేసినట్టు తెలుస్తోంది. దీంతో సిటాడెల్2 లో సమంత ఉండదని తెలిసి ఆమె అభిమానులు నిరాశ పడుతున్నారు. ప్రియాంక(Priyanka Chopra) నటిస్తున్న సిటాడెల్ సీజన్2 ఒరిజనల్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.













