బిగ్‌బాస్ సీజన్ 4 కి హోస్ట్‌గా కొత్త పేరు?
దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పేరుకి అన్ని సడలింపులు కనిపిస్తున్నా.. ఎవరికీ జీవనోపాధి లేదు, వ్యాపారాలు చేయలేక, ఉన్నది అమ్ముకోలేక ఒక్కొక్కరు ఒక్కో విధంగా బాధలు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఎంటర్టైన్మెంట్ రంగం మాత్రం ఏదో విధంగా తమ కార్యక్రమాలను ఆడియన్స్ దగ్గరకి తీసుకెళ్లాలని తాపత్రయపడుతోంది. ఎందుకంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఇళ్ళల్లోనే ఉంటున్నారు. ఇలాంటప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇష్టపడతారో దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈమధ్యకాలంలో ఎక్కవగా వినిపిస్తున్న పేరు బిగ్‌బాస్. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకొని నాలుగో సీజన్‌కి రెడీ అవుతోంది. లాక్డౌన్ కంటే ముందే సీజన్ 4కి సంబంధించిన ఏర్పాట్లు మొదలైపోయాయి. ఈ షోకి సంబంధించిన పోటీదారుల లిస్ట్ కూడా బయటికి వచ్చింది. అయితే షూటింగులు క్యాన్సిల్ చేయడం వల్ల ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ బిగ్‌బాస్ సీజన్ 4 గురించి అప్డే్ట్స్ వస్తున్నాయి.
ఈసారి హీరో తరుణ్, యాంకర్ వర్షిణి, బిత్తిరి సత్తి, మంగ్లీ, టీవీ నటుడు అఖిల్ సార్థక్ వంటి పేర్తు వినిపిస్తున్నాయి. గతంలో నాలుగో సీజన్‌కి సంబంధించి చాలా పేర్లతో కూడా లిస్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు కరోనా కారణంగా ఈ షోలో పాల్గొనేందుకు ఎక్కువ ఉత్సాహం చూపించడం లేదు సెలబ్రిటీలు. వీరి సంగతి ఇలా ఉంటే రాబోయే నాలుగో సీజన్‌ను హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తారు అనే దానిపై సోషల్ మీడియాలో చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి.













