బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కు పాము కాటు
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ పాముకాటుకు గురయ్యారు. సల్మాన్ నివాస ముంటున్న ఫార్మ్‌హౌస్‌లో ఆయన చేతికి పాము కరిచిందని సన్నిహితులు తెలిపారు. అయితే అది విషపు పాము కాకపోవడంతో ప్రమాదం తప్పిందని వారు వెల్లడించారు. ఇటీవల సల్మాన్ రాయిగడ్ జిల్లా సమీపంలోని పాన్వెల్‌లోని ఫార్మ్‌హౌస్‌లో కాలక్షేపం చేస్తున్నారు. పాము కాటుకు గురైన వెంటనే సల్మాన్‌ను నవీ ముంబయిలోని ఆస్పత్రిలో చేర్చామని సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం సల్మాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ముంబయిలోని నివాసానికి వెళ్లారని వారు తెలిపారు.













