సలార్.. మరో గేమ్ ఆఫ్ థ్రోన్స్
ఇప్పుడిప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ మానియా నుంచి బయటికొస్తున్నారు. ఇప్పుడు వాళ్ల దృష్టంతా ప్రభాస్ హీరోగా రానున్న తర్వాతి సినిమా సలార్ పై ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి కౌంట్‌డౌన్ కూడా మొదలుపెట్టింది ప్రొడక్షన్ హౌస్.
సలార్ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాల్సిందే అని కంకణం కట్టుకున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న శ్రియా రెడ్డి రీసెంట్గా సలార్ గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సలార్ అందరి ఊహలకు మించి ఉంటుందని, ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ రెండున్నర గంటల పాటు వేరే లోకానికి తీసుకెళ్తాడని చెప్పింది.
అంతేకాదు, ఈ సినిమాలో తన రోల్ కి చాలా ప్రాధాన్యత ఉంటుందని, ప్రభాస్ తో పాటూ మరో ఏడెనిమిది క్యారెక్టర్లు నాన్ స్టాప్ యాక్షన్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తాయన్నారు. ఇదంతా పక్కనపెడితే సలార్ సినిమాను గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో పోల్చడం విన్నాక అసలు ప్రభాస్ ఫ్యాన్స్ ని, వారి ఆనందాన్ని ఆపగలడం సాధ్యమేనా అనిపిస్తుంది. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టి, ఆగస్ట్ నుంచి స్పీడ్ పెంచనున్నారు.













