సలార్ డిజిటల్ రైట్స్‌కు భారీ రేట్
ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమా పై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ రిలీజై అప్పటివరకు ఉన్న హైప్‌ను మరింత పెంచింది. అంతేకాదు ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ మధ్య గట్టి పోటీ ఉందని తెలుస్తోంది.
సౌత్ భాషలు సహా హిందీ భాషల స్ట్రీమింగ్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ ఓ డీల్‌ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ కోసం ఆ ఓటీటీ సంస్థ దాదాపు రూ.200 కోట్ల వరకు కోట్ చేస్తున్నట్లు సమాచారం. కేవలం డిజిటల్ రైట్స్ కోసం ఈ రేంజ్ అమౌంట్ అంటే సలార్ సినిమాకు ఉన్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ డీల్ పూర్తయితే మాత్రం మేకర్స్ తమ బడ్జెట్లో మెజారిటీ భాగాన్ని తిరిగి రాబట్టుకున్నట్లే అవుతుంది. మిగతా శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ అంతా లాభాల్లోకి వెళ్తుంది. భారీ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ సినిమాగా తెరకెక్కిన సలార్ సినిమా రిలీజ్ కు ముందే ఈ రేంజ్ సునామీని సృష్టిస్తుందంటే ఇక సెప్టెంబర్ 28 తర్వాత ఏ రేంజ్ రికార్డులను క్రియేట్ చేస్తుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.













