రెండో సినిమాకే సొంత డబ్బింగ్
ఏజెంట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సాక్షి వైద్య. మోడలింగ్ చేస్తూ కెరీర్ లో మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న సాక్షికి ఏజెంట్ ఆఫర్ రావడంతో వెంటనే ఓకే అనేసింది. మొదటి సినిమానే పాన్ ఇండియన్ ఫిల్మ్ కావడంతో ఆలోచించే పనిలేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సాక్షి. అయితే ఈ సినిమాతో ఆమెకు వచ్చిన లాభమేమీ లేదనే చెప్పాలి.
ఏజెంట్ డిజాస్టర్ సాక్షి కెరీర్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సుంది. కానీ ఏజెంట్ సెట్స్ పై ఉండగానే అమ్మడుకు వరుణ్ తేజ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో గాంఢీవధారి అర్జున సినిమాలో వరుణ్ తో జట్టు కడుతోంది సాక్షి. ఈ సినిమాలో తన పాత్రకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నట్లు ఈ భామ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఎలాగైనా ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు వరుణ్. ప్రవీణ్ కూడా ది ఘోస్ట్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం చాలా ఫోకస్డ్ గా పనిచేస్తున్నాడు. అయితే కెరీర్ బిగెనింగ్లోనే రెండో సినిమాతో సొంత డబ్బింగ్ అంటే మాటలేమీ కాదు. కానీ ఈ మధ్య హీరోయిన్లంతా సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్న నేపథ్యంలో సాక్షి కూడా తెలుగు నేర్చుకునే ప్రయత్నంలో ఉంది. ఈ సినిమా హిట్ అయితే అమ్మడి కెరీర్ ఊపందుకునే అవకాశాలున్నాయి. కానీ ఇది కూడా ఏమైనా తేడా కొడితే మాత్రం సాక్షి కెరీర్ ముందుకెళ్లడం కష్టమనే చెప్పాలి.













