సైంధవ్ లాస్ట్ 20 మినిట్స్‌ను మర్చిపోలేరు!
సంక్రాంతికి రిలీజ్ కానున్న సైంధవ్ సినిమాకు మంచి బజ్ నెలకొంది. దానికి తోడు ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఆ అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఈ సినిమా గురించి డైరెక్టర్ శైలేష్ రోజుకో కొత్త విషయాన్ని చెప్తూ ఊరిస్తున్నాడు. మొన్నొక ఇంటర్వ్యూలో ఈ సినిమాలో రెగ్యులర్ బాషా సినిమా తరహా ఫ్లాష్‌బ్యాక్ ఉండదని, ఈ సినిమా కోసం ఓ కొత్త ప్యాట్రన్ సెలెక్ట్ చేసుకుని సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాడు.
ఇక రిలీజ్ కు మరో రెండ్రోజులే ఉందనగా శైలేష్, సైంధవ్ గురించి మరో కీలక అంశాన్ని వెల్లడించాడు. సైంధవ్ చివరి 20 నిమిషాలు ప్రతి ఒక్కరి లైఫ్ లో చూసిన అతి గొప్ప ఎక్స్పీరియన్స్ల్లో ఒకటిగా ఫీలవుతారని, అంత బాగా క్లైమాక్స్ రావడానికి కారణం వెంకీనే అని, ఒక గొప్ప నటుడి నుంచి మర్చిపోలేని నటనను రాబట్టుకోవడమనేది లైఫ్ లో ఏదో సాధించిన సంతృప్తిని ఇస్తోందని శైలేష్ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.
దీంతో ఇప్పటికే భారీగా ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సంక్రాంతికి ఎంత పోటీ ఉన్నప్పటికీ వెంకటేష్ సైలెంట్ గా హిట్ కొడతాడని దగ్గుబాటి అభిమానులు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని అంచనాల మధ్య రాబోతున్న సైంధవ్, వెంకటేష్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.













