Sailesh Kolanu: గత సినిమాలకు భిన్నంగా హిట్4
హిట్(Hit) ఫ్రాంచైజ్ లో భాగంగా వచ్చిన హిట్3(hit3) సినిమాను డైరెక్టర్ శైలేష్(Sailesh Kolanu) మరింత వయొలెంట్ గా రూపొందించిన విషయం తెలిసిందే. నాని(Nani) హీరోగా మే 1న రిలీజైన హిట్3 సినిమా మంచి టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. హిట్3 క్లైమాక్స్ లో హిట్4(Hit4)లో ఏ హీరో నటించబోతున్నాడనే క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ శైలేష్.
రీసెంట్ గా శైలేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హిట్4 కథ విషయంలో తానింకా ఓ నిర్ణయానికి రాలేదని, తనకు కేవలం ఒక ఆలోచన మాత్రమే ఉందని, దాన్ని ఫుల్ స్క్రిప్ట్ గా డెవలప్ చేయాలని, ప్రస్తుతం తాను ఫ్యామిలీతో కలిసి సిడ్నీకి వెళ్తున్నానని, కొడుకుతో కలిసి టైమ్ స్పెండ్ చేసి చాలా కాలమైందని, ఎప్పట్నుంచో తను, తన భార్య వెకేషన్ కు వెళ్దామనుకున్నామని అందులో భాగంగానే సిడ్నీ వెళ్తున్నామని చెప్పాడు.
సిడ్నీలోనే తాను రైటింగ్ పై ఫుల్ స్క్రిప్ట్ పై ఫోకస్ చేస్తానని చెప్పిన శైలేష్ హిట్4 మిగిలిన సినిమాల కంటే భిన్నంగా ఉంటుందని చెప్పాడు. హిట్4 ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఉంటూనే గత సినిమాల కంటే భిన్నంగా ఉంటుందని శైలేష్ తెలిపాడు. అయితే తన తర్వాతి సినిమా హిట్4 అని మాత్రం శైలేష్ ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే కొన్నాళ్లు ఫ్యామిలీతో గడిపి తర్వాత తన రైటింగ్ పై శైలేష్ ఫోకస్ చేయనున్నాడని తెలుస్తోంది.






