సాయి ధరమ్ తేజ్ తర్వాత సినిమా ఎప్పుడంటే?
విరూపాక్ష సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. తన యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సాయి తేజ్ వెండితెరపై బాగానే ఇంప్రెస్ చేశాడు. కానీ ఆ తర్వాత మేనమామ పవన్ కళ్యాణ్ తో చేసిన బ్రో సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. కమర్షియల్ గా ఈ సినిమా పెద్దగా ఏమీ లాభాలను తెచ్చిపెట్టలేదు.
బ్రో తర్వాత మళ్లీ కొంత గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు తన తర్వాతి సినిమాకు రెడీ కాబోతున్నట్లు తెలుస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ ఈ వారంలోనే మొదలుకాబోతుందని వార్తలొచ్చాయి. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకాస్త టైమ్ పట్టనుందని తెలుస్తోంది.
డైరెక్టర్ ఇంకా షూటింగ్ షెడ్యూల్స్ ను ఫిక్స్ చేయకపోవడం, ఇందులో హీరోయిన్ గా అనుకుంటున్న పూజా హెగ్డే కాల్షీట్స్ ఇంకా ఇవ్వకపోవడంతో ఇది లేట్ కానున్నట్లు తెలుస్తోంది. పూజా డేట్స్ ను బట్టి ఈ సినమిఆ షూటింగ్ కు షెడ్యూల్స్ సెట్ చేయనున్నారట. రీసెంట్గా ఈ సినిమా కోసం తేజ్ లుక్స్ పై ఓ టెస్ట్ జరిగిందని సమాచారం.
సినిమా మొదలయ్యే ముందుగానే ఈ సినిమా కోసం ఓ ప్రమోషనల్ వీడియోను షూట్ చేసి దాన్ని తేజ్ పుట్టిన రోజున రిలీజ్ చేయబోతున్నారట టీమ్. గాంజా శంకర్ అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా మాస్ బ్యాక్ డ్రాప్ లో ఉంటూనే కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనుందని, ఇందులో తేజ్ లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు చెప్తున్నారు.













