ఆసక్తికరంగా రూహి ట్రైలర్ విడుదల.. భయపెట్టిస్తున్న జాన్వీ
శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తొలిసారి థ్రిల్లర్ చిత్రంలో నటించింది. రూహి అనే టైటిల్‌తో రూపొందుతున్న చిత్రంలో జాన్వీతో పాటు రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్ర పోషించారు. వరుణ్ శర్మ, పంకజ్ త్రిపాఠి, అలెక్స్ ఓనెల్, సీమా పహ్వా, ఆమ్నా షరీఫ్, రోనిత్ రాయ్ లు కీలక పాత్రల్లో నటించారు. మార్చి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేయగా, ఇందులో హార్రర్, కామెడీ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు హార్దిక్ మెహతా ఈ సినిమాతో ప్రేక్షకులని భయపెట్టించడంతో పాటు నవ్వించనున్నాడు.
రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్ జంటగా నటించిన చిత్రం స్త్రీ. ఈ సినిమాకు సీక్వెల్ గా రూహిని తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో రూహీ అఫ్జానా అనే పేరుని మూవీకి ఫిక్స్ చేయగా, ఇప్పుడు రూహిగా మార్చారు. గత ఏడాది రూహీ విడుదల కావాల్సి ఉన్న కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మార్చిలో సందడి చేసేందుకు సిద్ధమైంది.













