సలార్2కు రూట్ క్లియర్
సలార్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో దానికి సీక్వెల్ గా రానున్న సలార్2 పై అందరికీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సలార్2 లేటవుతుందేమో అనుకుని టెన్షన్ పడిన వాళ్లకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది చిత్ర బృందం. వాస్తవానికి సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సింది కానీ దేవర పోస్ట్ పోన్ అయి ఏకంగా అక్టోబర్ కు వెళ్లింది.
షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం వల్ల ఎన్టీఆర్ ఇప్పుడే ఫ్రీ అవలేడు. దేవర అయ్యాక వార్2 సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అప్పటివరకు ప్రశాంత్ నీల్ ఖాళీగా ఉండకుండా రెడీగా ఉన్న సలార్2 స్క్రిప్ట్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట హోంబలే నిర్మాతలు. ఎలాగూ సలార్ మొదటి భాగానికి వేసిన సెట్స్ అలానే ఉన్నాయి కాబట్టి వీలైనంత త్వరగా సలార్2ను ఫినిష్ చేస్తే బావుంటుందని నిర్మాతలు అనుకుంటున్నారట.
సలార్2 కు రూట్ మొత్తం దాదాపు క్లియర్ అయినట్లే. కల్కి మూవీకి సంబంధించిన పనులన్నీ మే 9 లోపు పూర్తవుతాయి. ఆ తర్వాత రాజా సాబ్ సినిమాతో పాటూ సలార్2 సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడట ప్రభాస్. స్పిరిట్ సినిమాకు ఇంకాస్త టైముంది కాబట్టి ఈ లోగా సలార్2ను పూర్తి చేసేయొచ్చు. మరో వైపు హను రాఘవపూడి కూడా సైలెంట్ గా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతున్నాడు. సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఇంకా తెలియదు. కాబట్టి అన్నీ అనుకున్నట్లు జరిగితే సలార్2 2025లోనే థియేటర్లలోకి వచ్చే ఛాన్సుంది.













