బన్నీ ఐకాన్ కు రూట్ క్లియర్?
వకీల్ సాబ్ తో సాలిడ్ హిట్ కొట్టిన డైరక్టర్ వేణు శ్రీరామ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఫిల్మ్ ను చాలా కేర్ తీసుకుని హ్యాండిల్ చేసిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న వేణు శ్రీరామ్ తర్వాతి సినిమా ఏంటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. కెరీర్ మొదలుపెట్టి పదేళ్లవుతున్నా తన నుంచి వచ్చిన సినిమాలు మాత్రం ఇప్పటి వరకు మూడే. దీంతో ఇప్పుడైనా తన తర్వాతి సినిమాను వీలైనంత త్వరగా సెట్ చేసుకోవాలని చూస్తున్నాడట.
ఈ నేపథ్యంలోనే బన్నీ తో అనౌన్స్ చేసిన ఐకాన్ కనబడుట లేదు ప్రాజెక్ట్ మళ్లీ లైన్ లోకి రానుందని వార్తలొస్తున్నాయి. వాస్తవానికి ఐకాన్ సినిమాను దిల్ రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించాల్సింది. కానీ బన్నీ ఈ సినిమా కాకుండా అల వైకుంఠపురములో సినిమా ఫినిష్ చేసి, తర్వాత ఇప్పుడు పుష్ప ను సెట్స్ పైకి తీసుకెళ్లి, ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదే క్రమంలో వేణు శ్రీరామ్ కు వకీల్ సాబ్ ఆఫర్ రావడం, పుష్ప తర్వాత బన్నీ కొరటాలతో సినిమాను అనౌన్స్ చేయడంతో అందరూ ఐకాన్ గురించే మర్చిపోయారు.
కానీ ఇప్పుడు సిట్యుయేషన్స్ మారడంతో మళ్లీ ఐకాన్ పేరు వినిపిస్తుంది. పుష్ప లేట్ అవడంతో, కొరటాల ఎన్టీఆర్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. అంటే బన్నీ పుష్ప తర్వాత కొరటాల కోసం కొన్నాళ్లైనా వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉన్న ఐకాన్ వైపు బన్నీ అడుగులేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఐకాన్ గురించి చర్చలు కూడా స్టార్ట్ అయ్యాయని చెప్తున్నారు. కానీ రీసెంట్ గా ఇంటర్వూలో వేణు శ్రీరామ్ మాత్రం ఇంకా ఐకాన్ గురించి క్లారిటీ రాలేదని చెప్పుకొచ్చాడు. మరి ఈ విషయంలో క్లారిటీ అంటే బన్నీ నుంచే రావాలి.













