Kanthara: Chapter1: తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన రిషబ్ శెట్టి

కన్నడ హీరో రిషబ్ శెట్టి(rishab shetty) నటించిన కాంతార(kanthara) సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. సుమారు రూ.16 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార: చాప్టర్1(Kanthara: Chapter1) ను అనౌన్స్ చేశారు. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.
మొన్నామధ్య జూనియర్ ఆర్టిస్టులు బస్సులో వెళ్తుంటే బస్సు లోయలో పడగా, తర్వాత ఈతకు వెళ్లిన ఓ జూనియర్ ఆర్టిస్టు చనిపోవడం జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మరోసారి కాంతార టీమ్ కు ప్రమాదం ఎదురైంది. అయితే ఈసారి ఆ ప్రమాదం తృటిలో తప్పింది. కాంతార1 షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద ఉన్న వరాహి నది వెనుక ఏరియాలో జరుగుతుంది.
చిత్ర యూనిట్ మొత్తం ఆ రిజర్వాయర్ లో బోటులో వెళ్తుండగా పడవ బోల్తా పడింది. బోల్తా పడిన పడవలోనే హీరో రిషబ్ శెట్టి కూడా ఉన్నాడు. పడవ బోల్తా పడిన తర్వాత అందులోని వాళ్లంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరాఉ. మాణి జలాశయం వద్ద కాంతార1 షూటింగ్ ను 15 రోజుల పాటూ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ బోటు మునిగిపోవడంతో కెమెరా కూడా మునిగిపోవడంతో షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. ప్రమాదం నుంచి బయటపడ్డ చిత్ర యూనిట్ ప్రస్తుతం యడూరు సమీపంలోని ఓ రిసార్ట్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.