Rishab Shetty: మరో క్రేజీ ప్రాజెక్టుకు సైన్ చేసిన రిషబ్ శెట్టి

కాంతార(Kanthara) సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న రిషబ్ శెట్టి(Rishab Shetty) ప్రస్తుతం కాంతార సినిమాకు సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు. కాంతార తర్వాత జై హనుమాన్(Jai Hanuman) ను చేయనున్న రిషబ్ ఇప్పుడు ఓ కొత్త సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు స్వదేశ్(Swadesh), జోధా అక్బర్(Jodha Akbar), లగాన్(Lagaan) లాంటి క్లాసిక్ సినిమాలను తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్(Asutosh Gowarikar) దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో ఉంటుందట. విజయ నగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ విష్ణు వర్ధన్ ఇందూరి(Vishnuvardhan induri) భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారట. కాగా అశుతోష్ గోవారికర్ ఇప్పటికే మోహంజోదారో(Mohanjadaro), పానిపట్(Panipat) లాంటి పీరియాడికల్ సినిమాలు చేశారు.
అలాంటి స్టార్ డైరెక్టర్ ఇప్పుడు శ్రీ కృష్ణ దేవరాయల బయోపిక్ ను తీస్తున్నారంటే ఈ ప్రాజెక్టుకు మంచి బజ్ క్రియేట్ అవడం ఖాయం. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమాలో ఇండియన్ మూవీలోని పలువరు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అనౌన్స్ అయ్యే అవకాశముంది.