వర్మ సినిమా విడుదల వాయిదా
వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్గోపాల్ వర్మ సారథ్యంలో తెరకెక్కిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా విడుదలకు హైకోర్టు అడ్డుచెప్పింది. ఇంకా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాలేదన్న నేపథ్యంలో వారం రోజుల్లో సినిమాలోని అభ్యంతరక అంశాలను పరిశీలించాలని, అనంతరం సెన్సార్ ధృవీకరణ ఇవ్వాలని సెన్సార్ సభ్యులకు తెలిపింది. న్యాయస్థానం అభ్యంతరం మేరకు ఇప్పటికే టైటిల్ను అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని మార్చామని రామ్గోపాల్ వర్మ కోర్టుకు విన్నవించుకున్నారు. వారం రోజుల్లో ఈ చిత్రానికి సెన్సార్ బృందం అనుమతి ఇస్తే..సినిమా తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి.













