ఆర్జీవీ.. రోజూ గిల్లే వాడు
గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో మాగ్నస్ సినీ ప్రైమ్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ఆర్జీవీ. రోజు గిల్లే వాడు ఉపశీర్షిక. వెంకట శ్రీనివాస్ బొగ్గరం (కార్తికేయ ఫేమ్). టారస్ సినికార్ప్ సమర్పణలో బాలా కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్నారు. సురేష్, రాశి, శ్రద్దాదాస్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా టైటిల్ లోగోను చిత్రబృందం విడుదల చేసింది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్లు తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఓ వ్యక్తి ఫిలాసఫీ మీద సంధించిన రామబాణమే ఈ చిత్రం. అందుకే శ్రీరామనవమి రోజున టైటిల్ లోగోను విడుదల చేశాం అని తెలిపారు. చిత్ర సమర్పకుడు వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ సామాజిక బాధ్యత లేని ఓ వ్యక్తి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందో ఈ సినిమాలో చూపించబోతున్నాం. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని తెలిపారు. అమిత్, పునర్మవి భూపాలం, తేజ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : వేదాంత్ మల్లాది, కూర్పు: కార్తిక శ్రీనివాస్, సంగీతం: వీణాపాణి, కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం, దర్శకత్వం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.













