RGV: జాన్వీతో సినిమా చేసే ఉద్దేశం లేదు: ఆర్జీవీ
టాలీవుడ్ ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) శ్రీదేవి(Sridevi)కి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివ(Siva) సినిమా తర్వాత కేవలం శ్రీదేవి కోసమే క్షణ క్షణం(Kshana Kshanam) రాసుకుని ఆ సినిమాని శ్రీదేవి కోసం రాసిన లవ్ లెటర్ అని ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు. అందుకే ఆ సినిమాలో వెంకటేష్(Venkatesh) ఎంట్రీ కూడా అరగంట లేట్ గా ఉంటుందని అప్పట్లో వార్తలొచ్చాయి.
క్షణ క్షణం తర్వాత గోవిందా గోవిందా(Govinda Govinda) సినిమా చేశారు కానీ ఆ సినిమా ఫ్లాపవడంతో మళ్లీ ఈ కాంబోలో సినిమా వీలుపడలేదు. ఆ తర్వాత కూడా శ్రీదేవిపై సందర్భం వచ్చినప్పుడల్లా తన ప్రేమను బయటపెడుతూ ఉండేవాడు ఆర్జీవి(RGV). అలాంటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi kapoor) పై ఆర్జీవీ అభిప్రాయమేంటన్నది తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీకి ఈ ప్రశ్న ఎదురవగా, ఆయన అసలు మొహమాటపడకుండా జాన్వీకి శ్రీదేవి అందం రాలేదని, ఒకవేళ ఛాన్స్ వచ్చినా తనతో ఇప్పట్లో సినిమా తీసే ఉద్దేశమే లేదని తేల్చిచెప్పాడు వర్మ. అయితే ఆర్జీవీ చేయాలనుకున్నా ఆయనతో సినిమా చేయడానికి జాన్వీ ఒప్పుకుంటుందా అని నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు. దానికి కారణం ఆర్జీవీకి గతంలో లాగా ఇప్పుడు మంచి ట్రాక్ రికార్డు లేకపోవడమే.













