భగవంత్ కేసరి, విజ్జి పాప రిలేషన్ ఇదే…
మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భగవంత్ కేసరి సినిమా విషయంలో ఫ్యాన్స్ తో పాటూ సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో వెయిట్ చేస్తున్నారు. అఖండ, వీర సింహారెడ్డి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడం, ఆ సినిమాకు అనిల్ రావిపూడి లాంటి కమర్షియల్ డైరెక్టర్ దరకత్వం వహించడంతో సినిమా మీద అంచనాలు బాగా పెరిగిపోయాయి.
దానికి తోడు ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా పై హైప్ మరింత పెరిగింది. భగవంత్ కేసరి కేవలం మాస్ సినిమా మాత్రమే కాదని, చాలా ఎమోషనల్ ఫిల్మ్ అని ట్రైలర్ తో పాటూ అనిల్ రావిపూడి కూడా క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీలీల, బాలయ్య మధ్య వచ్చే ఎమోషన్స్ సినిమాలో హైలైట్ అయ్యేలా ఉంటాయని ట్రైలర్ తెలుస్తోంది.
ఇందులో శ్రీలీల ఉరఫ్ విజ్జిపాప భగవంత్ కేసరికి మేనకోడలు. ఆర్మీ ఆఫీసరైన తండ్రి శరత్ కుమార్ చనిపోతే ఆమె సంరక్షణ మేనమామ అయిన బాలయ్య మీద పడుతుంది. అంతేకాదు బావ కోరిక మేరకు ఎలాగైనా సరే విజ్జిపాపను మిలటరీలో చేర్చాలని దానికోసం చాలా కష్టపడుతుంటాడు భగవంత్ కేసరి. మామా కోడలు సెంటిమెంట్‌తో బాలయ్య, శ్రీలీల ఈసారి ప్రేక్షకుల్ని తమ నటనతో ఫిదా చేయనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.













