టిల్లూ సౌండ్ చేయకపోవడానికి కారణమేంటి?
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న తాజా చిత్రం టిల్లూ స్వ్కేర్. డీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా రిలీజ్ కు మరో 25 రోజులు మాత్రమే టైముంది. మార్చి 29న టిల్లూ స్వ్కేర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు.
రిలీజ్ కు నెల రోజుల ముందే ట్రైలర్ ను కూడా వదిలారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో పాటూ అనుపమ గ్లామర్ షో వల్ల సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అయితే సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా అయితే సితార బ్యానర్ నుంచి వచ్చే ఏ సినిమాకైనా ప్రమోషన్స్ ను పీక్స్ లో చేస్తారు.
కానీ ఈ సినిమా విషయంలో ప్రమోషన్స్ ఇంకా మొదలుపెట్టలేదు. దానికి కారణం టిల్లూ స్వ్కేర్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు పెండింగ్ లో ఉన్నాయట. వాటిని ఆఘమేఘాల మీద పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. షూటింగ్ కు సంబంధించి కూడా చిన్న చిన్న షాట్స్ బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. దీని కోసం ప్రస్తుతం సిద్దూ చేస్తున్న తెలుసు కదా, జాక్ నుంచి బ్రేక్ తీసుకుని తన డేట్స్ అన్నీ టిల్లూ స్వ్కేర్ కోసమే కేటాయించినట్లు తెలుస్తోంది.













