నటుడిగా మారడానికి కారణం చెప్పిన అనురాగ్
బాలీవుడ్(Bollywood) డైరెక్టర్లలో ఒకరైన అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా అందరికీ సుపరిచితుడే. డైరెక్టర్ గా సినీ మాధ్యమం ద్వారా డిఫరెంట్ కథలను అందించాలనే ఉద్దేశంతోనే తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని, కెరీర్ స్టార్టింగ్ లో తాను ఎన్నో ఇబ్బందులు పడినట్లు అనురాగ్ రీసెంట్ గా ఓ ఫిల్మ్ ఫెస్టివల్ లో వెల్లడించాడు.
దేవ్ డి(Dev D సినిమా గురించి మాట్లాడుతూ దేవదాస్ ఇండియన్స్‌కు ఎంతో ఇష్టమైన లవ్ స్టోరీ అని కానీ తన దృష్టిలో అదేమీ పెద్ద కథ కాదని, దేవదాస్ బుక్ ఆధారంగా ఇప్పటికే 20 సినిమాల వరకు వచ్చాయని, ఆ కథకు కొంచెం సమకాలీన విషయాలను జోడించి తాను దేవ్ డి కథ రాసుకున్నట్లు అనురాగ్ తెలిపాడు. ఆ కథ ఎవరికీ నచ్చలేదని, కానీ నిర్మాత భార్యకు కథ రనచ్చడం వల్ల సినిమా తీసినట్లు చెప్పుకొచ్చాడు అనురాగ్.
అంతేకాదు తాను తీసిన బాబే వెల్వెట్ ఫ్లాప్ అవడం వల్ల ఆ నిర్మాణ సంస్థకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సి రావడంతో దానికోసం వాళ్లు నిర్మించిన అకీరా(Akira) సినిమాలో నటించానన్నారు అనురాగ్ కశ్యప్. అప్పటినుంచి తనకు యాక్టర్ గా ఆఫర్లొస్తున్నాయని ఆయన తెలిపాడు. రీసెంట్ గా అనురాగ్ నటించిన మహారాజ(Maharaja) సినిమా సూపర్ సక్సెస్ అయింది. అనురాగ్ అప్పులు తీర్చడానికి నటుడిగా మారనా ఆయనకు ఇప్పుడు చాలా ఆఫర్లొస్తున్నాయి.













