రవితేజ సరసన శ్రుతి హాసన్
బలుపు లో రవితేజ, శ్రుతీ హాసన్ జంట సందడి చేసింది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. వీళ్లిద్దరు మరోసారి జంటగా నటించనున్నారు. డాన్ శీను, బలుపు తర్వాత దర్శకడు గోపీచంద్ మలినేనితో రవితేజ ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పవర్పుల్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా ప్రకటించారు. ఇందులో శ్రుతీ హాసన్ కథానాయికగా నటించనున్నారు. రవితేజతోనే కాదు, బలుపు తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితోనూ ఆమెకు రెండో చిత్రమిది. నవంబర్లో ఈ సినిమా ప్రారంభం కానుంది.













