మళ్లీ కొత్త డైరెక్టర్‌తో రవితేజ
టాలీవుడ్ లో ఎంతో మంది యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి వాళ్లకు లైఫ్ ఇచ్చిన హీరో రవితేజ. శ్రీను వైట్ల నుంచి హరీష్ శంకర్, బాబీ, గోపీచంద్ మలినేని వరకు అందరూ రవితేజ పరిచయం చేసిన వాళ్లే. అయితే ఈ మధ్య రవితేజ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం మానేశాడు. 2017 తర్వాత రవితేజ కొత్త డైరెక్టర్ తో సినిమా చేసింది లేదు.
2017 లో రవితేజ టచ్ చేసి చూడు సినిమ కోసం విక్రమ్ సిరికొండ అనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి సినిమా చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో రవితేజ మళ్లీ కొత్త దర్శకులతో సినిమా చేసే సాహసం చేయలేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రవితేజ ఓ కొత్త డైరెక్టర్ తో జత కట్టబోతున్నట్లు తెలుస్తోంది.
వాసు అనే కొత్త దర్శకుడితో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రవితేజ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. వాసు ఓ మాస్ కథతో రవితేజను మెప్పించాడని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఈగల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్న రవితేజ తర్వాత గోపీచంద్ మలినేనితో మైత్రీ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇది కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో హిందీ బ్లాక్ బస్టర్ మూవీ రైడ్‌ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రవితేజ రీమేక్ చేయనున్నాడు. దీంతో పాటూ తనకు ధమాకా లాంటి మంచి హిట్ ను అందించిన త్రినాథరావు నక్కిన తో కూడా రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో అస్సలు ఖాళీ లేకుండా బిజీ లైఫ్ ను గడుపుతున్నాడు.













