నాని ని ఫాలో అవుతున్న రవితేజ
ఏప్రిల్ 7న రావణాసురతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. భారీ బడ్జెట్తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో రవితేజ కనిపించనున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో రవితేజ కూడా భాగస్వామ్యం అయిన విషయం తెలిసిందే. సొంతంగా నిర్మాణ సంస్థ మొదలు పెట్టిన రవితేజ, తన సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నాడు.
ఇప్పుడు తన సినిమాలతో పాటూ, చిన్న బడ్జెట్ సినిమాలను కూడా వేరే హీరోలతో చేయడానికి రవితేజ రెడీ అవుతున్నట్లు సమాచారం. రవితేజ లానే బ్యానర్ స్టార్ట్ చేసిన నాని మొదట్లో అ! అనే సినిమాను చేశాడు. ఆ సినిమాతో నాని నిర్మాతగా కమర్షియల్ హిట్ అయితే అందుకోలేదు కానీ మంచి సినిమా తీశారని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత శైలేష్ దర్శకత్వంలో హిట్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.
తర్వాత దానికి సీక్వెల్గా హిట్ 2 కూడా తీసి, సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ప్రొడక్షన్ విషయంలో రవితేజ, నానినే ఫాలో అవుతున్నాడు. తన బ్యానర్ నుంచి మొదటి సినిమాను విశ్వక్ సేన్ హీరోగా నిర్మించాలని చూస్తున్నాడట రవితేజ. రవితేజ కోసం చెప్పిన ఓ స్క్రిప్ట్ తో తన బ్యానర్లో విశ్వక్ తో సినిమా చేయాలనేది రవితేజ ప్లాన్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే ఛాన్సుందని సమాచారం. విశ్వక్ బాగా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలడనే కారణంతో ఎన్ని వివాదాలున్నా అతనితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.













