సమ్మర్ టార్గెట్ గా రవితేజ తులాభారం!
మాస్ మహారాజా రవితేజ(Raviteja)కు ఇరుముడి(Irumudi) సినిమా మంచి సక్సెస్‌ను అందించడంతో ఆయన నెక్ట్స్ ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ సినిమా తర్వాత తన లైనప్‌లో మార్పులు చేసుకున్న రవితేజ.. విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek athreya)తో తులాభారం(Thulabharam) సినిమాను పట్టాలెక్కించారు. విభిన్నమైన కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాను ఇంట్రెస్టింగ్ వీడియో ద్వారా అనౌన్స్ చేసిన మేకర్స్.. తాజాగా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూటింగ్ లో రవితేజ కూడా పాల్గొన్నారు. ఈ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ను ఆడియన్స్ కు కొత్త అనుభూతిని అందించేలా రూపొందించేందుకు డైరెక్టర్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు.
2027 సమ్మర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో మేకర్స్ వర్క్ చేస్తున్నారు. లక్ష్మణ్, శ్రీనిరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజకు జోడీగా కాకుండా కథలో కీలక పాత్రల్లో ప్రియాంక మోహన్(Priyanka mohan), అనస్వర రాజన్(Anaswara rajan) నటిస్తున్నారు. వీరితో పాటు తరుణ్ భాస్కర్(Tharun bhaskar), జేడీ చక్రవర్తి(JD Chakravarthy), అనిల్ కరెళ్ల(Anil karella), రవి ఆంథోనీ(Ravi anthony) తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకునే వివేక్ ఆత్రేయ ఈసారి క్రైమ్ కామెడీ జానర్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాకు వివేక్ సాగర్(Vivek athreya) మ్యూజిక్ అందిస్తున్నారు. కథ, నటీనటుల ఎంపికతో ఇప్పటికే ఆసక్తిని పెంచిన తులాభారం.. షూటింగ్ పూర్తయ్యేలోపు రవితేజ తన నెక్ట్స్ మూవీని కూడా అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. వరుస ప్రాజెక్టులతో ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతున్న రవితేజకు తులాభారం మరో సక్సెస్‌ను అందిస్తుందా అన్నది చూడాలి.








