రష్మిక అకౌంట్లో మరో పాన్ ఇండియన్ ఫిల్మ్
వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే రష్మిక స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కెరీర్ స్టార్టింగ్‌లోనే స్టార్ హీరోలతో నటించిన రష్మిక నేషనల్ క్రష్‌గా ఎదిగింది. అయితే పుష్ప తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్‌ను అందుకోవడానికి రష్మిక చాలానే తిప్పలు పడుతుంది. తను నటించిన సీతారామమ్ సినిమా బాగా ఆడినా ఆ క్రెడిట్ మృణాళ్ కు వెళ్లిపోయింది.
తర్వాత వచ్చిన ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా పెద్దగా ఆడలేదు. విజయ్ తో వచ్చిన వారసుడు సక్సెస్ కు విజయ్ క్రేజే కారణం. అందుకే రష్మిక బాలీవుడ్‌ను టార్గెట్ చేసుకుంది. బాలీవుడ్ లో ఏ చిన్న ఛాన్స్ వచ్చినా వదులుకోవడానికి రష్మిక ఇష్టపడట్లేదు. అమితాబ్ బచ్చన్ తో డెబ్యూ మూవీగా చేసిన గుడ్ బై సినిమా ఫ్లాప్ అయినా, సిద్దార్థ్ మల్హోత్ర సరసన మిషన్ మజ్నులో నటించినా అనుకున్న ఫలితాలైతే దక్కలేదు.
ఇప్పుడు రష్మిక ఆశలన్నీ తను రన్బీర్ కపూర్ తో కలిసి నటిస్తున్న యానిమల్ సినిమా మీదే. ఇది తన కెరీర్లోనే చాలా పెద్ద సినిమా అవుతుందని రష్మిక ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే రష్మిక ఖాతాలో మరో పాన్ ఇండియన్ ఫిల్మ్ వచ్చి చేరిందని సమాచారం. విక్కీ కౌశల్ కు జోడీగా తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా చావాలో నటించేందుకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని బాలీవుడ్ వర్గాల సమాచారం.













