బాలీవుడ్‌లోకి రష్మిక ఎంట్రీ?
అతి తక్కువ కాలంలో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకున్న అందాల భామ రష్మిక మందన్న. ప్రస్తుతం మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న ఆమెకు మరొక గోల్డెన్ ఛాన్స్ దక్కిందని టాక్. అది కూడా బాలీవుడ్లో కావడం విశేషం. తెలుగు సూపర్ హిట్ చిత్రం జెర్సీని హిందీలోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత కరణ్‌జోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. అతనికి జోడిగా రష్మిక మందన్నను తీసుకుంటే బాగుంటుందని కరుణ్ జోహర్ భావిస్తున్నారట. దాదాపు ఆమెనే ఖాయంగా చేసినట్టు తెలిసింది. షాహిద్ కపూర్ గత చిత్రం కబీర్ సింగ్ భారీ హిట్ కావడంతో జెర్సీ హిందీ రీమేక్ పెద్ద ప్రాజెక్ట్ కానుంది. అలాంటి పెద్ద సినిమాతో హిందీ పరిశ్రమలోకి ప్రవేశించనుంది రష్మిక మందన్న.













