రష్మికకు అంత సీనుందా?
పుష్ప మూవీతో రష్మిక మందన్నా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే బాలీవుడ్ లో వరుస ఛాన్సులు అందుకుంటుంది. ఇంతకుముందు గుడ్ బై, మిషన్ మజ్ను లాంటి సినిమాల్లో నటించినప్పటికీ, పుష్ప తర్వాత తన స్థాయి పెరిగిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న రష్మిక ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తన సత్తా చాటడానికి ట్రై చేస్తుంది.
ఇప్పటికే రెయిన్ బో అనే సినిమా చేస్తున్న రష్మిక, తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ అనే కొత్త సినిమాను కూడా పట్టాలెక్కించింది. ఈ రెండు కూడా తెలుగు సినిమాలే. అయితే సోలోగా రష్మిక ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించనుందా అనేది ఇప్పుడు ప్రశ్న. నటిగా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఇప్పటివరకు సోలోగా సినిమాలు చేసింది లేదు.
సీతారామం లాంటి సినిమాలో ఆఫ్రిన్ పాత్రలో మెరిసి ఆకట్టుకుంది రష్మిక. సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా సరే ఎక్కడా ఈ పాత్ర సినిమాలో అనవసరం అనిపించదు. ఆ పాత్ర సినిమాకు వన్నె తీసుకొచ్చింది తప్పించి, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ మాత్రం ఎక్కడా వినిపించలేదు. ఆ యాంగిల్ చూస్తే రష్మిక సోలోగా తన సత్తా ఏంటో కచ్ఛితంగా చూపిస్తుందని ట్రేడ్ ఎనలిస్టులు భావిస్తున్నారు. మరి రష్మికకు ఈ రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.













