రష్మిక టాటూ వెనుక కథ ఇది
ఇండియన్ ఫిల్మ్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్స్‌లో రష్మిక మందన్నా ఒకరు. నేషనల్ క్రష్ గా రష్మిక క్రేజ్ దక్కించుకుంది. బ్లాస్ బస్టర్ పుష్ప ది రైజ్‌లో బన్నీ సరసన శ్రీవల్లి పాత్రతో మెప్పించిన రష్మిక, గతేడాది గుడ్ బై సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ తో కలిసి రష్మిక నటించింది.
అసలు విషయానికొస్తే, రీసెంట్ ఫోటోషూట్లలో రష్మిక ఎక్కువగా ఇర్రీప్లేసబుల్ అనే టాటూని చూపిస్తూ ఉంటుంది. ఇన్‌స్టా లో తన ఫ్యాన్స్, ఫాలోయర్స్ తో ఈ టాటూని షేర్ చేసుకుంటుంది. అయితే రీసెంట్ ఇంటర్య్వూలో తన కుడిచేతి మణికట్టు కింద ఉంటే ఈ టాటూని ఎందుకు వేయించుకుందో బయటపెట్టింది.
కాలేజ్ డేస్‌లో తనకు టాటూ అనేది చాలా బలమైన కోరిక. నేను దాన్ని సాధించాలనుకున్నా. మా కాలేజ్ లో ఓ అబ్బాయి వచ్చి అమ్మాయిలు కూడా టాటూలు వేయించుకోగలరా అని అడిగాడని, దానికి చాలా బాధ పడ్డానని రష్మిక రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అమ్మాయిలు ఇంజెక్షన్కే భయపడతారనే ఉద్దేశ్యంతో ఆ అబ్బాయి అలా అడిగాడని కూడా రష్మిక తెలిపింది.
ఆ అబ్బాయి అలా అనడంతో కసితో రెచ్చిపోయి, టాటూ వేయించుకోవాలనుకున్నప్పటికీ, టాటూలు ఎక్కడ వేస్తారో, ఎలా వేయించుకోవాలో, ఏం వేయించుకోవాలో తెలియకుండా ఆలోచిస్తున్న టైమ్‌లో ఇర్రీప్లేసబుల్ అనే పదాన్ని టాటూ వేయించుకోవాలని నిశ్చయించుకున్నట్లు రష్మిక తెలిపింది. కాగా రష్మిక అంధ బాలికగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ జనవరి 20 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.













