ఫ్యామిలీ స్టార్ లో రష్మిక?
విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుని ఫ్యామిలీ స్టార్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమే అని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి.
ఫారిన్ షెడ్యూల్ కు బ్రేక్ రావడంతో సినిమా సంక్రాంతి లోపు పూర్తవదని, అందుకే సినిమాను వాయిదా వేసే అవకాశమున్నట్లు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కాబట్టి ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి రేసులో ఉందనే అనుకోవాలి. రిలీజ్ కు టైమ్ ఉండటంతో మేకర్స్ ఫ్యామిలీ స్టార్ కు అదనపు ఆకర్షణలు జోడిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ సినిమాలో రష్మిక మందన్న క్యామియో ఉంటుందని తెలుస్తోంది. తనకు టాలీవుడ్ లో గీత గోవిందం లాంటి మంచి హిట్ ఇచ్చిన పరశురామ్, ఫ్యామిలీ స్టార్ లో ఓ చిన్న క్యామియో కోసం రష్మికను అడిగాడని, హీరో విజయ్ కావడంతో రష్మిక వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే మాత్రం విజయ్- రష్మికను మరోసారి తెరపై చూడటానికైనా ఆడియన్స్ థియేటర్ల బాట పట్టే ఛాన్సుంది.













