Rashmika Mandanna: భారీ మల్టీస్టారర్ లో రష్మిక?
యానిమల్(Animal), పుష్ప2(Pushpa2) సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో రష్మిక మందన్నా(rashmika mandanna) సెన్సేషనల్ అయిపోయింది. ఆ రెండు సినిమాలతో వచ్చిన క్రేజ్ వల్ల రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. బెంగుళూరు నుంచి వచ్చిన ఓ నటి ఈ రేంజ్ లో ఎదగడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే రష్మిక అట్లీ(Atlee) సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది.
జవాన్ సినిమా తర్వాత అట్లీ ఓ భారీ మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తున్నాడు. కోలీవుడ్ నుంచి రజినీకాంత్(rajinikanth) కానీ, కమల్ హాసన్(Kamal haasan) కానీ, బాలీవుడ్ నుంచి కండలవీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) ను తీసుకుని పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు అట్లీ. ఇప్పటికే ఆ మల్టీస్టారర్ కు కథ రెడీ చేసిన అట్లీ, ఆల్మోస్ట్ సల్మాన్ తో ఓకే చేయించుకున్నాడు.
కోలీవుడ్ నుంచి ఎవరు నటిస్తారనేది ఫైనల్ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా రష్మికను తీసుకోవాలనుకుంటున్నాడట అట్లీ. రీసెంట్ గా రష్మికను కలిసి కథ కూడా వినిపించాడని, కథ నచ్చడంతో రష్మిక కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ వార్త నిజమై రష్మిక ఈ మల్టీస్టారర్ లో నటిస్తే తన క్రేజ్ ఇంకా పెరగడం ఖాయం.













