సెన్సార్ పూర్తి చేసుకున్న రణరంగం
శర్వానంద్, కాజల్, కల్యాణి ప్రియదర్శిని కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు సుధీర్‌వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం రణరంగం. సెన్సార్ పూర్తయి ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడారు. ఈ చిత్రానికి యుబైఎ సర్టిఫికెట్ వచ్చిందన్నారు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నామని తెలిపారు. దర్శకుడు తెరకెక్కించిన తీరు ఎంతో ప్రశంసనీయంగా ఉందన్నారు. అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. గ్యాంగ్‌స్టర్‌గా శర్వానంద్ నటిస్తున్నట్టు తెలిపారు. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రంలో ఉంటాయన్నారు.













