గోపీచంద్ సినిమాలో రానా స్పెషల్ క్యారెక్టర్..
ఒక్క సినిమా జీవితాన్నే మార్చేస్తుంది. బాహుబలి తర్వాత రానా రేంజ్ మారిపోయింది. ఆయన కనిపిస్తే చాలు థియేటర్లు మోత మోగిపోతాయి. రానా కు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. అంతే కాదు రానా చేసే సినిమాలకు క్రేజ్ కూడా అంతే పెరుగుతుంది. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ విరాట పర్వం కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రానా తో గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పించారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరి రానా చేయనున్న ఆ గెస్ట్ రోల్ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ప్రముఖ డైరక్టర్ తేజ డైరక్షన్ లో అలిమేలుమంగ వెంటకరమణ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో గోపీచంద్ హీరోగా నటించబోతున్నాడు. తేజ డైరక్షన్ లో గతంలో గోపీచంద్ జయం, నిజం సినిమాలు చేశాడు కానీ అందులో విలన్ గా నటించాడు. కానీ ఇప్పుడు అలిమేలుమంగ వెంకటరమణ లో మాత్రం హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ఉందట. ఆ రోల్ కోసం దగ్గుబాటి రానా ను నటించమని అడుగుతున్నట్లు తెలుస్తుంది.
ఒక్క సీన్ మాత్రమే ఉండే ఈ క్యారెక్టర్ క్లైమాక్స్ లో రానుందంటున్నారు. తేజ డైరక్షన్ లో రానా హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మంచి హిట్ గా నిలిచింది. ఆ రిలేషన్ తోనే తేజ రానాని ఈ క్యారెక్టర్ కోసం ఒప్పించినట్లు తెలుస్తుంది. ఈ క్యారెక్టర్ సినిమాకు ఎంతో కీలకంగా నిలవనుందట. అందుకే ఈ పాత్ర చేయడానికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్నారు. కరోనా ప్రభావం ఏమీ లేకుండా ఉంటే జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిననున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి చేశారు. రీసెంట్ గా గోపీచంద్ ను కలిసి కథ ఫైనల్ నెరేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తేజ ఈ కథను రెడీ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందని, తేజ ఈ సినిమాను విభిన్నంగా ఆవిష్కరించబోతున్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ సినిమా చేస్తున్నారు.













