ప్రైమ్ తో రానా కనెక్షన్
కాఫీ విత్ కరణ్ అనే టాక్ షో తో కరణ్ జోహార పేరు, క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ హోస్ట్ లకు ధీటుగా దానికి మించి సెలిబ్రిటీ టాక్ షో లతో మరికొంత మంది స్టార్లు కూడా పేరు తెచ్చుకున్నారు. ప్రతీ సినీ పరిశ్రమల్లోని ప్రముఖ స్టార్లు ఓటీటీ, బుల్లి తెరపై హోస్ట్ లుగా రాణిస్తున్నారు.
అయితే ఎన్ని షోలు, టాక్ షోలు వచ్చినా కాఫీ విత్ కరణ్ షో మాత్రం ఎప్పటికీ స్పెషల్ గానే ఉంటుంది. ఆడియన్స్ లో అంత పాపులర్ అయిన సెలిబ్రిటీ టాక్ షో ఇదే. ఇలాంటి ఓ షో ని సౌత్‌లో రీక్రియేట్ చేయాలని ఎంతో మంది ట్రై చేశారు కానీ అనుకున్న ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయారు. టాలీవుడ్ ఆల్ రౌండర్ రానా దగ్గుబాటి నెం.1 యారీ అనే పేరుతో ఓ షోని నిర్వహించాడు.
అందులో తన సన్నిహితులందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేశాడు. ఓటీటీలో ఈ షో యావరేజ్ అనిపించుకుంది. ఇప్పుడు రానా అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఇలాంటి ఒక షోను హోస్ట్ చేస్తున్నాడు. తాజాగా జరిగిన స్పెషల్ ఈవెంట్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతినిధులు రానా హోస్ట్ గా టాక్ షో ను నిర్మిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ది రానా కనెక్షన్ పేరుతో సాగే ఈ షో లో పలువురు సెలిబ్రిటీలు పాల్గొననున్నారు. మరి ఈ షో అయినా కాఫీ విత్ కరణ్ ను మ్యాచ్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.













