Baahuabali the Epic: బాహుబలి ది ఎపిక్ రన్ టైమ్ పై రెస్పాండ్ అయిన రానా

ఇండియన్ సినిమా గర్వంగా చెప్పుకునే బాహుబలి(Baahubali) ఫ్రాంచైజ్ రిలీజ్ టైమ్ లో ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి1(Baahubali1) రీసెంట్ గా పదేళ్లు పూర్తి చేసుకున్న కారణంగా మరియు రీరిలీజుల ట్రెండ్ ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో బాహుబలి మేకర్స్ ఓ కొత్త ఆలోచన చేశారు. బాహుబలి ఫ్రాంచైజ్ లో వచ్చిన రెండు సినిమాలనూ కలిపి ఒకే సినిమాగా రీరిలీజ్ చేయబోతున్నారు.
బాహుబలి: ది ఎపిక్(Baahubali: The Epic) అనే టైటిల్ తో రానున్న ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పుడీ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుక్ మై షో ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ 5 గంటల 27 నిమిషాలు. ఇది చూసి అంతా షాకవుతున్నారు. దానికి తగ్గట్టే నిర్మాత శోభు(Shobhu) కూడా ఈ సినిమా రన్ టైమ్ ఓ థ్రిల్లింగ్ ఐపీఎల్ మ్యాచ్ అంత ఉంటుందని చెప్పడంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశమైంది.
ఈ విషయంపై తాజాగా కొత్తపల్లిలో ఒకప్పుడు(Kothapallilo Okappudu) ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన రానా(Rana)ను అడగ్గా, ఈ సినిమా రన్ టైమ్ ఎంతైనా తనకు సంతోషమని, ఈ ఏడాది తానే సినిమాలో నటించకుండానే తనకు బ్లాక్ బస్టర్ రాబోతుందని, అయినా అంత రన్ టైమ్ ఉంటే ఆడియన్స్ చూడరేమో అంటూనే, ఈ విషయంలో రాజమౌళి(Rajamouli)కి తప్ప ఎవరికీ ఏమీ తెలీదని, దీని గురించి ఆయనకు మాత్రమే తెలుసని చెప్పడంతో అందరూ ఇప్పుడు జక్కన్న క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు.