శృంగార తారగా రమ్యకృష్ణ ?

వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ ఈసారి ఎవరూ ఊహించని పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో సూపర్ డీలక్స్ చిత్రంలో శృంగార తార (పోర్న్‌స్టార్)గా కనిపించనుందట. అయితే ఈ పాత్రకు మొదటగా మరో సీనియర్ హీరోయిన్‌ను తీసుకుందామనుకున్నాడట డైరెక్టర. అది వర్క్‌అవుట్ కాకపోయేసరికి రమ్యకృష్ణను ఓకే చేశారని సమాచారం. 2004లో వచ్చిన సునామి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సమంత, ఫహద్ ఫాసిల్, మిస్కీన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్న చిత్రానికి పిఎస్ వినోద్, నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కుమార్‌రాజా తెరకెక్కిస్తున్న చిత్రం మూడుగంటల నిడివితో ప్రేక్షకులముందుకు రానుంది.