Ramya Krishna: రమ్య ఆ సినిమా చేస్తుందా? లేదా?
రెండు దశాబ్దాల పాటూ సౌత్ ఇండియాని రూల్ చేసిన రమ్యకృష్ణ(Ramya Krishna) ఆ తర్వాత తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అయింది. బాహుబలి (Baahubali)లో శివగామి(Sivagaami) పాత్ర చేశాక తన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత రమ్యకృష్ణకు వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది.
సినిమాలో తన పాత్ర ప్రాధాన్యతను బట్టే మూవీ ఓకే చేస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది ఆమె గుంటూరు కారం(Gunturu Karam), పురుషోత్తముడు (Purushothamudu) సినిమాల్లో నటించగా ఆ రెండు సినిమాలూ అనుకున్న స్థాయిలో సక్సెస్ అవలేదు. రీసెంట్ గా రమ్యకృష్ణ, నాని(Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల(srikanth Odela) దర్శకత్వంలో రూపొందనున్న ది ప్యారడైజ్(The Paradise) సినిమాలో నటిస్తుందని వార్తలొచ్చాయి.
ఇప్పటికే ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) విలన్ గా కన్పర్మ్ అయాడని ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. రమ్యకృష్ణ పాత్ర విషయంలో కూడా మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు అసలు ది ప్యారడైజ్ కోసం ఇప్పటివరకు ఎవరూ రమ్యని సంప్రదించలేదని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం హిట్3(Hit3) చేస్తున్న నాని ఆ సినిమా తర్వాత ది ప్యారడైజ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.













