నదియా పాత్రలో రమ్యకృష్ణ
ఒకప్పటి హీరోయిన్లు ఇప్పుడు అత్త, అమ్మ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరోసారి అత్త పాత్రలో కనిపించనున్నారు. గతంలో ఆమె నా అల్లుడు, ఇటీవలే వచ్చిన శైలజారెడ్డి అల్లుడులో అత్తగా నటించి మెప్పించారు. తాజాగా మరోసారి అత్త పాత్రలో నటిస్తున్నారు. అయితే అది తమిళ చిత్రం. తెలుగు విజయం సాధించిన, పవన్‌కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. హీరోగా శింబు నటిస్తున్నారు. తెలుగులో మేనత్త పాత్రలో నదియా నటించింది. ఇప్పుడు ఈ పాత్రని తమిళంలో రమ్యకృష్ణ పోషిస్తున్నట్టు తెలిసింది. మేఘా ఆకాశ్, కేథరీన్ థెరీసా నాయికలుగా నటిస్తున్నారు. లైగా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుందర్ సి.దర్శకత్వం వహిస్తున్నారు. లైగా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.













