రామాయణం కోసం భారీ రంగం సిద్ధం
రామాయణంను ఇండియాలోనే గొప్ప దృశ్యకావ్యంగా తీయాలని డైరెక్టర్ నితీష్ తివారి సంకల్పించుకున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టే సినిమాను వచ్చే నెలలో భారీగా అనౌన్స్ చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఇప్పటికే రాముడిగా రణ్బీర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ కన్ఫర్మ్ అయ్యారని నార్త్ మీడియాలో వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
మూడు భాగాల్లో తెరకెక్కనున్న ఈ రామాయణంను ఏప్రిల్ 17న లాంచ్ చేసేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో అయోధ్య గురించి పరిచయం, రాముడి ఎంట్రీ, సీతా స్వయంవరం, వనవాసం, సీతను రావణుడు అపహరించడం ఉంటుందట. తర్వాతి పార్ట్ లో హనుమంతుడి పాత్ర ఎంట్రీ అవుతుంది.
స్క్రిప్ట్ వర్క్ చాలా పకడ్భందీగా జరుగుతుందని తెలుస్తోంది. సినిమా బడ్జెట్ ఎంతనేది ఇంకా బయటకు చెప్పడం లేదు. మొదటి పార్ట్ రిలీజ్కు ఎంత లేదన్నా ఓ సంవత్సరం పడుతుంది. మొత్తం సిరీస్ రిలీజ్ అయ్యే నాటికి కనీసం నాలుగేళ్లైనా పడుతుంది. రాముడుకి సంబంధించిన సినిమా కాబట్టి సినిమా ఓపెనింగ్ కు నరేంద్ర మోడీని పిలవాలని చూస్తున్నారట. రాముడికి సంబంధించిన సినిమా కాబట్టి మోడీ కూడా నో చెప్పకపోవచ్చు.













