Kishkindhapuri: కిష్కింధపురిలో రామాయణం రిఫరెన్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(bellamkonda sai sreenivas), అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) జంటగా నటించిన తాజా సినిమా కిష్కింధపురి(Kishkindhapuri). కౌశిక్ పెగిళ్లపాటి(kaushik pegillapati) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హార్రర్ థ్రిల్లర్ జానర్ లో రూపొందింది. షైన్ స్క్రీన్స్(Shine Screens) బ్యానర్ లో సాహు గారపాటి(Sahu Garapati) ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 12న కిష్కింధపురి ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కిష్కింధపురి సినిమా రెగ్యులర్ హార్రర్ మూవీలా కాకుండా ఈ సినిమాలో గ్రిప్పింగ్ స్టోరీ, అసాధారణ కథ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు. శ్రీనివాస్ ఈ కథ వినగానే ఎంతో ఇంప్రెస్ అయ్యారని, ఎలాంటి మార్పులు లేకుండానే సినిమాను ఓకే చేశారని సమాచారం.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథ రామాయణం(ramayanam) నుంచి స్పూర్తి పొంది తీసుకుందని టాక్ వినిపిస్తోంది. కిష్కింధపురి అనే టైటిల్ వినగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది రామాయణమే. సినిమాలోని చాలా విషయాలు రామాయణంకు కనెక్ట్ అయి ఉంటాయని, ఇప్పటికే రామాయణం నుంచి ఇన్‌స్పైర్ అయి ఎన్నో సినిమాలు వచ్చి మంచి హిట్లుగా నిలవగా ఇప్పుడు కిష్కింధపురి కూడా వాటి లానే హిట్ అవుతుందని అంటున్నారు. టెక్నికల్ గా బాగా రిచ్ గా కనిపిస్తున్న కిష్కింధపురి సక్సెస్ పై చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.