Ramayana: రామాయణం పార్ట్1 ఎడిటింగ్ పూర్తి

రణ్‌బీర్ కపూర్(ranbir kapoor), సాయి పల్లవి(sai pallavi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రామాయణ(Ramayana). ఇప్పటికే రామాయణం గాధపై ఎన్నో సినిమాలు రాగా, ఇప్పుడు నితేష్ తివారీ(nitesh Tiwari) అదే కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ నుంచే రామాయణపై భారీ అంచనాలు నెలకొనగా, మొన్నామధ్య రిలీజైన గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
కాగా ఈ సినిమాలో భారీ తారాగణం కూడా నటించనుంది. రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్(Yash), హనుమంతుడిగా సన్నీ డియోల్(Sunny Deol), సూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్(rakul preeth singh), మండోదరిగా కాజల్ అగర్వాల్(kajal agarwal), కైకేయిగా లారా దత్తా(lara dutta) కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
మొదటి భాగం 2026 దీపావళికి రిలీజ్ కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడో అప్డేట్ తెలుస్తోంది. రామాయణ పార్ట్1కు సంబంధించిన ఫైనల్ ఎడిటింగ్ పూర్తైందని, ఎడిటింగ్ వర్క్ ను పూర్తి చేసుకున్న మేకర్స్ ఇప్పుడు వీఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం 300 రోజులను కేటాయించనున్నట్టు తెలుస్తోంది.