Ram Pothineni: రామ్ హిట్ కొట్టేట్టే ఉన్నాడే!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని(ram pothineni) హిట్ అందుకుని చాలా సినిమాలవుతుంది. అప్పుడెప్పుడో వచ్చిన ఇస్మార్ట్ శంకర్(ismart shankar) మూవీనే అతని ఆఖరి సక్సెస్. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు. కానీ సక్సెస్ మాత్రం దక్కలేదు. ఎప్పటికప్పుడు ఈ సినిమా హిట్టవుతుందనుకోవడం, ఆ సినిమా నిరాశ పరచడం ఇదే జరుగుతూ వస్తుంది. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసిపై ఉన్నాడు రామ్.
అందులో భాగంగానే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss shetty Mr polishetty) డైరెక్టర్ మహేష్ బాబు(Mahesh Babu.P) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు రామ్. భాగ్య శ్రీ బోర్సే(Bhagya sri borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతుండగా నవంబర్ 28న ఆంధ్రా కింగ్ తాలూకా(Andhra king thaluka) రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఇవాళ్టితో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తైందని తెలుస్తోంది. కోకాపేట్ స్టూడియో లో ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టారని, ఇకపై చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టనుందని తెలుస్తోంది. అంతేకాదు, అవుట్పుట్ విషయంలో కూడా మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారని అంటున్నారు. ఈ కాన్ఫిడెన్స్ చూస్తుంటే రామ్ ఈసారి హిట్ కొట్టేట్టే కనిపిస్తున్నాడు.







