రెడ్ మొదలైంది…
కెరీర్లో తొలిసారి థ్రిల్లర్ జోనర్లో నేను చేస్తున్న సినిమా ఇది. వాణిజ్య హంగుల మేళ వింపుతో విభిన్నంగా ఉంటుంది అన్నారు రామ్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న రెడ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకుడు. పూజా కార్యక్రమాల అనంతరం రామ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు పూరి జగన్నాథ్ క్లాప్‌నివ్వగా, నిర్మాత జెమిని కిరణ్ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ భిన్న భావోద్వేగాల సమాహారంగా సాగుతుంది. నవ్యమైన పాయింట్‌తో తెరకెక్కిస్తున్నాం. నా గెటప్ వినూత్నంగా ఉంటుంది. ఏప్రిల్‌లో సినిమా విడుదల చేస్తాం అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ నవంబర్ 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఓ విజయవంతమైన సినిమాలోని ఆత్మను తీసుకొని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాం అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.













