డబుల్ ఇస్మార్ట్ పైనే రామ్ ఆశలన్నీ!
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ హిట్ అందుకున్న రామ్ పోతినేని, ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయాయి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో తెలంగాణ యాసతో మాట్లాడి ఇంప్రెస్ చేసిన రామ్, వరుస ఫ్లాపులతో కన్ఫ్యూజన్లో ఉన్నాడు. రామ్ ఇప్పుడు తనకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన పూరీతో కలిసి పనిచేస్తున్నాడు.
ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్‌గా పూరీ, రామ్ కలిసి డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు పూరీ. బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసేందుకు విలన్ గా సంజయ్ దత్ ను కూడా తీసుకున్నారు. ఈ సినిమాపై రామ్ పోతినేని చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకుని తన కెరీర్ గ్రాఫ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు రామ్.
రామ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడినా కానీ సినిమా రిజల్ట్ మాత్రం డైరెక్టర్ పూరీ, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పైనే ఉంది. వీరిద్దరూ తమ నుంచి వీలైనంత బెస్ట్ అవుట్‌పుట్ ఇస్తేనే ఈ సినిమా హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ అందుకునే ఛాన్సుంది. మణిశర్మ తన మ్యూజిక్‌తో జనాల్ని థియేటర్లకు రప్పించగలిగే రేంజ్ మ్యూజిక్ ఇవ్వాలి.
పూరీ కూడా తన మైండ్‌కు పని చెప్పి, ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా తీయాల్సి ఉంది. డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ అవడం ఈ చిత్రంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. హీరో రామ్‌కి, డైరెక్టర్ పూరీకి, నిర్మాత ఛార్మీకి, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు డబుల్ ఇస్మార్ట్ విజయం ఎంతో కీలకం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.













