కుటుంబ సభ్యుల మాటలకు హర్టయిన రామ్
టాలీవుడ్ లో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో చాలా మంది స్టార్లు గా ఎదిగారు. కానీ కొంతమంది మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేక ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. అయితే శ్రీ స్రవంతీ మూవీస్ నిర్మాత తమ్ముడైన రామ్ పోతినేని మాత్రం హీరోగా మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. హీరోల కొడుకులు హీరోలవడం తేలికే కానీ ఇలా ప్రొడ్యూసర్ తమ్ముడి కొడుకు స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు.
అయితే రామ్ తనకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే హీరో అవాలని డిసైడయ్యాడట. కానీ ఆ టైమ్ లో తన ఫ్యామిలీ మెంబర్స్ అన్న మాటలకు హర్టయి బ్యాక్ గ్రౌండ్ వాడుకోకుండా సినిమాల్లోకి రావాలని ట్రై చేసినట్లు రామ్ తెలిపాడు. ముందుగా తాను హీరో కావాలనుకుంటున్నట్లు తన తల్లికి ఎనిమిదేళ్ల వయసులో రామ్ చెప్పాడట.
అయితే రామ్ పెదనాన్న నిర్మాత కాబట్టి ఆ మోజుతో రామ్ హీరో అవాలనుకుంటున్నాడని తన కుటుంబ సభ్యులనుకున్నారట. ఆ మాటకు ఎంతో బాధ పడిన రామ్ తను తెలుగులో హీరో కానని, తనెవరో తెలియని చోట హీరో అవుతా అని చెప్పి తమిళం నుంచి ఎంట్రీ చేయడానికి రెడీ అయ్యాడట. టీనేజ్ కు వచ్చాక చెన్నైకి వెళ్లి అక్కడే ట్రయల్స్ కూడా స్టార్ట్ చేశాడట. ఆ టైమ్ లో రామ్ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ చూసి వైవీఎస్ చౌదరి తనను సంప్రదించి పట్టుబట్టి మరీ టాలీవుడ్ కు తీసుకొచ్చి దేవదాసు సినిమా చేశాడని రామ్ వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రామ్ కు పట్టుదల ఎక్కువే అని కామెంట్స్ చేస్తున్నారు.













