RGV: ఆర్జీవీ ఎలా అన్నారో కానీ.. ఆ ఆలోచనే భలే ఉంది

ఎప్పుడూ ఏదొక పోస్ట్ చేస్తూ నిత్యం కాంట్రవర్సీల్లో ఉండే సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఇప్పుడు మరోసారి తన పోస్ట్ తో హాట్ టాపిక్ గా మారారు. ఆయన రీసెంట్ గా ఎక్స్ లో చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఒకప్పుడు పవన్(Pawan) ను ఆకాశానికెత్తుతూ పొగిడిన ఆర్జీవీ(RGV), గత కొన్నేళ్లుగా వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఆయన్ని, ఆయన ఫ్యాన్స్ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
అలాంటి ఆర్జీవీ ఉన్నట్టుండి ఇప్పుడు పవన్ పై పాజిటివ్ గా ట్వీట్ చేశారు. అసలు మ్యాటర్ లోకి వస్తే, చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు(Pranam Kharidhu) రిలీజై నిన్నటికి 47 ఏళ్లు పూర్తైన సందర్భంగా అందరూ చిరూకి విషెస్ చెప్పగా, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా తన అన్నయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. దానికి ఆర్జీవీ రీపోస్ట్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు.
మీరిద్దరూ కలిసి ఒక మూవీ చేస్తే అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్ లో మెగా పవర్ జోష్ ను నింపుతుందని, మీ కాంబినేషన్ లో సినిమా వస్తే అది ఈ శతాబ్దంలోనే మెగా పవర్ సినిమా అవుతుందంటూ ఆర్జీవీ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఆర్జీవీ కావాలని అటెన్షన్ కోసం ఈ పోస్ట్ వేసినప్పటికీ అతని ఆలోచన మాత్రం చాలా బావుంది. వారిద్దరూ కలిసి సినిమా చేస్తే ఆయన చెప్పినట్టే బెస్ట్ మూవీ అవడం ఖాయం. మరి ఆయన ఆలోచనని ఎవరు అమలు పరుస్తారో చూడాలి.