ఆచార్య కు వీడ్కోలు చెప్పిన సిద్ధ
చిరూ, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య లో రామ్ చరణ్ ఒక కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కామ్రేడ్ సిద్ధగా చరణ్ కనిపించనున్నాడు. మారేడుమిల్లి అడవి ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ చేశారు. చిరూ, చరణ్ కాంబినేషన్ లోని సీన్లను అక్కడ చిత్రీకరించినట్లు చెప్తున్నారు. చరణ్ భుజం పై చిరూ చేయి వేసిన ఫోటో ఒకటి చరణ్ షేర్ చేస్తూ.. ఇది కామ్రేడ్ సమయం, ఆచార్య సెట్ లో నాన్న, కొరటాల తో ప్రతీ క్షణం ఆనందిస్తున్నా అంటూ షేర్ చేశారు. అంటే ఆచార్య లోని తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని తెలుస్తుంది.
మారరేడుమిల్లి అటవీ ప్రాంతంలో తన తండ్రి చిరంజీవితో కలిసి 20 రోజుల లాంగ్ షెడ్యూల్ లో పాల్గొన్న చరణ్ తన క్యారెక్టర్ షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు ఘన సన్మానం చేసి వీడ్కోలు పలికిందని తెలుస్తుంది. ఉపాసన తో కలిసి రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు రిటర్న్ అయిన ఈ దంపతులకు ఫ్యాన్స్ ఎయిర్ పోర్ట్ దగ్గర భారీ సన్మానం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి కూడా.
తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో చిరంజీవి సరసన కాజల్, చరణ్ సరసన పూజా హెగ్డేలు నటిస్తుండగా మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా మే 13న ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుంది.













