Peddi: పెద్ది కోసం తెగ కష్టపడుతున్న చరణ్

ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్(ram charan) నుంచి తర్వాత ఆచార్య(acharya), గేమ్ ఛేంజర్(game changer) సినిమాలు రాగా, ఆ రెండు సినిమాలూ డిజాస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో నెక్ట్స్ మూవీతో ఎలాగైనా మంచి హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో పెద్ది(peddi) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్టపడుతున్నాడు. పెద్ది కోసం చరణ్ పడుతున్న కష్టం అడుగుడగునా కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ది ఫస్ట్ షాట్ ద్వారా ఈ సినిమా కోసం చరణ్ ఏ రేంజ్ లో మేకోవర్ అయ్యాడో చూశాం. మొన్నామధ్య లీకైన వీడియోలో లవ్ సాంగ్ కోసం చరణ్ ఒక లోయ అంచున ఉన్న చెట్టు కొమ్మపై డ్యాన్స్ వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
తాజాగా పెద్ది సెట్స్ నుంచి మరో వీడియో లీకవగా, అందులో చరణ్ ఒక నిటారైన కొండను ఎలాంటి సహాయం లేకుండా కష్టపడుతూ ఎక్కుతుండగా, బుచ్చిబాబు మాత్రం చరణ్ వెనుక ఓ ఇద్దరి సహాయంతో వారిని పట్టుకుని పైకి ఎక్కుతూ కనిపించాడు. ఈ వీడియోలన్నీ చూశాక చరణ్ ఈ సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడని అందరూ అభిప్రాయపడుతున్నారు. పెద్ది సినిమాను ఎంతో నమ్మిన చరణ్, తన కెరీర్లో ఎప్పుడూ చెప్పనిది ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని హామీ కూడా ఇచ్చాడు. వచ్చే ఏడాది మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ కానున్న పెద్ది మరి చరణ్ ఆశలను ఏ మేరకు నెరవేరస్తుందో చూడాలి.