గేమ్ ఛేంజర్‌తో శంకర్ ఆటలు
తమిళ దర్శకుడు శంకర్ ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలు చేయడం ఇటు హీరోలకు, అటు నిర్మాతలకు తలనొప్పిగా మారింది. అలా ప్రస్తుతం శంకర్, కమల్ హాసన్‌తో ఇండియన్2, రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇక్కడ కమల్‌కు పెద్దగా ఇబ్బంది లేదు కానీ ఇండియన్2 ఎఫెక్ట్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై చాలానే ఉంది. ఇప్పటికే దాదాపు మూడేళ్లయ్యాయి. ఈ సినిమా గురించి ఇప్పటి వరకు వచ్చింది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే. రీసెంట్గా గేమ్ ఛేంజర్ నుంచి ఓ సాంగ్ లీక్ అయితే అది విని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే స్థితికి శంకర్ తీసుకొచ్చాడు. ఇండియన్2 సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా? ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తారా అని మెగా ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే చెన్నై ఫిల్మ్ వర్గాల టాక్ ప్రకారం, ఇండియన్2 తర్వాత ఇండియన్3 కూడా చేయాలని శంకర్ మనసులో ఉందని, దీనికి ముందు కమల్ ఒప్పుకోకపోయినప్పటికీ, పలు డిస్కషన్స్ తర్వాత ఓకే చెప్పారని తెలుస్తోంది. కాకపోతే అన్ని సినిమాల్లా కాకుండా పార్ట్ 3ని కూడా పార్ట్2 తో పాటే షూట్ చేయాలని అనుకుంటున్నారట. అదే జరిగితే గేమ్ ఛేంజర్ కు మరో కొత్త ప్రాబ్లమ్ వచ్చినట్లే. ఇప్పటికే వచ్చే ఏడాది సినిమా రాదని ఫ్యాన్స్ బాధ పడుతుంటే అలాంటి సందర్భంగా ఇలాంటి వార్తలు వింటే ఫైర్ అవడం ఖాయం. ఏదేమైనా గేమ్ ఛేంజర్ విషయంలో శంకర్ ఏదొకటి త్వరగా తేల్చేస్తే అందరికీ బాగుంటుంది.













